ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు ఇవ్వండి: సజ్జనార్

హైదరాబాద్ (CLIC2NEWS): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రయాణికులను సంస్థ ఎండీ వి.సి. సజ్జనార్ కోరారు. ప్రయాణికులే సంస్థకు నిధి అన్న ఆయన.. సంస్థను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సోషల్ మీడియా వేదికగా సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులు, ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను స్వయంగా పరిశీలించి.. వాటిని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ప్రతి ప్రయాణీకుడు సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, ఫిర్యాదులను md@tsrtc.telangana.gov.inకు పంపి ఆర్టీసీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎండి కోరారు. అలాగే ట్విట్టర్ అకౌంట్ @tsrtcmdofficeను ఫాలో కావాలని ఎండి కోరారు.
Press Note in the Regard of any suggestions feedback or Grievances. Public can reach us on Social Media & also can write a email to md@tsrtc.telangana.gov.in (Customers are our Gods They are the Revenue Generators of @TSRTCHQ @KTRTRS @puvvada_ajay @DeccanChronicle @THHyderabad pic.twitter.com/zkRlmowFFO
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 3, 2021