తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తూ కుప్పకూలిన న్యాయవాది

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ హైకోర్టులో ఓ న్యాయవాది గుండెనొప్పితో కుప్పకూలిపోయారు. కోర్టు హాలులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన తోటి న్యాయవాదులను కలచి వేసింది. 21వ కోర్టులో న్యాయవాది వేణు గోపాలరావు వాదనలు వినిపిస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన కోర్టు హాలులో ఉన్న మిగతా న్యాయవాదులు అతన్ని వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. న్యాయవాది వేణు గోపాలరావు మృతికి సంతాపంగా 21వ కోర్టు హాలులో పిటిషన్ల విచారణను న్యాయమూర్తి నిలిపివేశారు. అదేవిధంగా మిగతా కోర్టుల్లోనూ అత్యవసరమైనవి , పాస్ ఓవర్ పిటిషన్లను విచారించి.. రెగ్యులర్ పిటిషన్లను వాయిదా వేసినట్లు సమాచారం.