80 ఏళ్ల పోరాటం.. తన ఆస్తిని దక్కించుకున్న 93 ఏళ్ల మహిళ
ముంబయి (CLiC2NEWS): ప్రస్తుతం ఆమె వయస్సు 93 ఏళ్లు.. 80 ఏళ్ల పోరాటం అనంతరం అలిస్ డిసౌజాకు ఆస్తిని తిరిగిచ్చేయాలని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఎనిమిది దశాబ్ధాల పాటు జరిగిన భూవివాదం.. 93 ఏళ్ల బామ్మకు రెండు ఫ్లాట్లను తిరిగి ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
1942వ సంత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం కింద ముంబయిలోని బరాక్ రోడ్‌లో ఉన్న రూబి మాన్షణ్ భవనాన్ని అధీనంలోకి తీసుకుంది. దీనిలోని రెండు ఫ్లాట్లు అలిస్ డిసౌజా కుటుంబానికి చెందనవి. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ అధికారి డిఎస్ లాడ్‌కు ఆ ఫ్లాట్లను కేటాయించారు. 1946లో రిక్కిసిషన్ (ప్రవేటు ఆస్తులను బ్రిటిష్ పాలకులు స్వాధీనం చేసుకోవడం) ఆదేశాలను ఎత్తివేశారు. దాంతో రూబి మాన్షన్‌లోని ఫ్లాట్లను తిరిగి ఇచ్చేయడం ప్రారంభించారు. కానీ బ్రిటిష్ అధికారి లాడ్ కుటుంబం మాత్రం ఈ ఫ్లాట్లను ఖాళీ చేసేందుఉ అంగీకరించలేదు.
అలిస్ డిసౌజా తండ్రి అప్పటి కలెక్టర్ దగ్గరకు వెళ్లగా.. ఫ్లాట్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. కానీ లాడ్ కుటుంబం ఇళ్లను అప్పగించలేదు. 2010లో కంట్రోలర్ ఆఫ్ అకామిడేషన్ కూడా ఫ్లాట్లను ఖాళీ చేయాలని వారి వారసులకు ఆదేశాలు జారీ చేసింది.. వారు ఖాళీ చేయకపోగా.. 2012 లో వారు హైకోర్టును ఆదేశించారు. అప్పుడు కూడా న్యాయస్థానం డిసౌజా కుటుంబానికి ఫ్లాట్లను అప్పగించాలని ఆదేశాలిచ్చింది. కానీ వారు మాత్రం కోర్టు తీర్పును పాటించలేదు. దీంతో డిసౌజా కుటుంబం మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. రిక్విసిషన్ ఉత్తర్వులను ఉపసంహరించిన తరవ్ఆత మా ఫ్లాట్లు తప్ప మిగిలినవి అసలైన యజమానులక అప్పగించారు. కానీ మాఫ్లాట్లను మాత్రం మేం ఇంతవరకూ పొందలేకపోయాం అని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం .. ఎనిమిది వారాల్లో ఆ రెండు ఫ్లాట్లను ఖాళీ చేయించి డిసౌజాకు అప్పగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.