ఎపి రాజధాని అమరావతిలో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా..
అమరావతి (CLiC2NEWS): గుజరాత్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ -టెక్ సిటి (గిప్ట్) మాదిరిగా ఎపి రాజధానిలో పూర్తిగా పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) ముందుకొచ్చింది. గిప్ట్ సిటిలో గ్గ్యాస్, విద్యుత్, టెలికం కేబుళ్లు మొత్తం భూగర్భంలోనే ఉంటాయి. నగరలోని అన్ని ఇళ్లకు పైప్‌లైన్ ద్వార గ్యాస్ సరఫరా అవుతుంది. అదే తరహాలో దేశంలో మొట్టమెదటి పైప్‌గ్యాస్ వినియోగించే రాజధానిగా అమరావతిని చేస్తామని ఐఒసి బృందం తెలిపింది. దీనికి సిఎస్ అంగీకారం తెలిపినట్లు సమాచారం.
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పిఎన్‌జిఆర్‌బి) సభ్యుడు రమణకుమార్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సిఎస్ నీరబ్ కుమార్‌తో సమావేశమైంది. ఈ సమావేశంలో గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణ ప్రాజెక్టులపై చర్చించారు. ఎపిలో భవిష్యత్తులో గ్యాస్ పైప్‌లైన్ ద్వారా 80 లక్షల కుటుంబాలకు కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఎపి గ్యాస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దినేశ్‌కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా పిఎన్‌జిఆర్‌బి సహకారం అందించాలన్నారు.