ఇక నుండి ఓయులో ఎఐ, ఎంఎల్ నైపుణ్యాలు
హైదరాబాద్ (CLiC2NEWS): ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఇకనుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), మిషన్ లెర్నింగ్ (ML), డేటా అనలిటిక్స్ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. దీని ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. దీని కోసం ఎఐ లింక్ టెక్నాలజిస్ సంస్థతో ఓయు ఇంజినీరింగ్ కళాశాల అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.
విద్యార్థులను అత్యాధునిక నైపుణ్యాలతో పరిశ్రమలకు అవసరమైన నిపుణులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో ఎఐ, ఎంఎల్, డేటా అనలిటిక్స్ వంటి అప్లికేషన్స్ పై సంపూర్ణ అవగాహన కల్పించనున్నారు. సర్టిఫికెట్ ప్రోగ్రామ్, హ్యాండ్స్ ఆన్ వర్క్‌షాప్‌లు, ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించనున్నారు.
[…] Also Read: ఇక నుండి ఓయులో ఎఐ, ఎంఎల్ నైపుణ్యాలు […]