బహుజన వర్గాల స్ఫూర్తి దాత ఐలమ్మ : ముఖ్య‌మంత్రి కెసిఆర్‌

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ 126వ జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఆమె ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఐలమ్మ తెలంగాణ బహుజన వర్గాల స్ఫూర్తి ప్రదాతగా పేర్కొన్నారు. సాయుధ పోరాట కాలంలోనే తన హక్కుల సాధన కోసం కొట్లాడిన గొప్ప ప్రజాస్వామికవాదిగా కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఐలమ్మ ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తి ఇమిడి ఉన్నదన్నారు. చిట్యాల ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, భావితరాలు గుర్తుంచుకునే విధంగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందని ముఖ్య‌మంత్రి కెసిఆర్  తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.