టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా

న్యూఢిల్లీ (CLiC2NEWS): ఎయిరిండియాను అధికారికంగా టాటా స‌న్స్ గ్రూప్కు కేంద్రం అప్ప‌గించింది. గురువారం న్యూఢిల్లీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఈ అప్ప‌గింత జ‌రిగింది. బిడ్డింగ్‌లో ఎయిరిండియాను ద‌క్కించుకున్న టాటా అనుంబంధ సంస్థ ట్యాలెస్ ప్రైవేటు లిమిటెడ్కు అధికారికంగా ఎయిరిండియాను అప్ప‌గించిన‌ట్లు దీప‌మ్ కార్య‌ద‌ర్శి కాంత్ పాండే గురువారం మీడియాకు తెలిపారు. దాదాపు రూ. 18 వేల కోట్ల బిడ్‌తో ఎయిరిండియాను టాటా స‌న్స్ టేకోవార్ చేసుకుంది.
టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా రావ‌డం ఆనందంగా ఉంద‌ని ఆ సంస్థ చైర్మ‌న్ ఎన్ చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు. టాటా గ్రూప్ ఉద్యోగులుగా మార‌నున్న ఎయిరిండియా ఉద్యోగుల‌కు సంస్థ‌లోకి ఆహ్వానించారు. దీనిపై ర‌త‌న్ టాటా కూడా సంతోషం వ్య‌క్తం చేశారు.

కాగా దాదాపు 69 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎయిరిండియా తిరిగి టాటాస‌న్స్ చెంతుకు చేరుకుంది. టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్‌ను 1932లో ప్రారంభించింది. 1946లో దాన్ని ఎయిరిండిగా పేరు మార్చారు. 1953లో ఎయిరిండియాను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్ప‌టు మ‌ల్లీ అదే గ్రూప్‌నుకు ఎయిరిండిడా చేరింది.

Leave A Reply

Your email address will not be published.