పూర్తిగా స్వదేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక: ఐఎన్ఎస్ విక్రాంత్
కొచ్చి (CLiC2NEWS): ప్రధానమంత్రి నరేంద్ర మోడి ‘విమాన వాహక నౌక ఐఎన్ ఎస్ విక్రాంత్’ను కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. యుద్ధ విమానాలను మోసుకెళ్లే ఈ నౌకను పూర్తిగా స్వదేశీయంగా తయారు చేశారు. భారత్ నిర్మించిన నౌకలన్నిటికంటే ఇది అతి పెద్ద నౌక కావడం విశేషం. దీని నిర్మాణానికి సుమారు రూ. 20,000 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. దీనివలన భారత్ ప్రపంచంలో విమాన వాహక నౌకలు నిర్మించగల సామర్థ్యం ఉన్న దేశాలలో 6వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు అమెరికా, యుకే, రష్యా, ఫ్రాన్స్, చైనా దేశాల వద్ద మాత్రమే ఈ సామర్థ్యం ఉండేది. ఈ నౌక గంటకు 28 నాట్స్ వేగంతో 7,500 నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు. ఈ నౌకపై మిగ్-29 కె ఫైటర్ జెట్‌లు, కమావ్-31, హెచ్ ఆర్-60 ఆర్ హెలికాప్టర్లు దీనిపై అందుబాటులో ఉండనున్నాయి.