ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 400 ఉద్యోగాలు

ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన‌ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లో 400 జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. సైన్స్‌, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టుల‌కు అర్హులు. ఎయిర్‌పోర్టుల స‌మ‌ర్థ నిర్వ‌హ‌ణ‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి) కీల‌కం. ఈ పోస్టుల‌కు ఎంపికైన వారు కార్యాల‌యాల్లో ఉంటూ విమాన రాక‌పోక‌లు ప‌ర్య‌వేక్షిస్తూ, ప్ర‌యాణం సాఫీగా జ‌రిగేలా చూస్తారు. ఆన్‌లైన్ ప‌రీక్ష‌తో అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి రూ. 12 ల‌క్ష‌ల వార్షికాదాయం అందుతుంది. అభ్యుర్థులు జులై 2022 నాటికి 27 ఏళ్లు మించ‌కూడ‌దు. దివ్యాంగుల‌కు ప‌దేళ్లు, ఎస్సి, ఎస్టిల‌కు ఐదేళ్లు, ఒబిసిల‌కు మూడేళ్లు స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది జులై 14.

Leave A Reply

Your email address will not be published.