యెమన్లోని జైలుపై వైమానిక దాడి.. 100 మంది మృతి
యెమన్లోని జైలుపై సౌదీ ఆరేబియా వైమానికి దాడి చేసింది. ఈ ఘటనలో జైలులో 100 మందికి పైగా మృతిచెందినట్లు రెడ్‌క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ అధికార ప్రతినిధి వెల్లడించారు. సౌదీ ఆరేబియా, యెమన్ దేశాలు ఒకదానిపై మరొకటి వైమానిక దాడులకు పాల్పడుతున్నాయి. ఈనెల 17న అబుధాబిలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై యెమన్ తిరుగుబాటు దాడుల జరిపిన దాడులలో ఇద్దరు భారతీయులతో సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. సౌదీ తిరిగి మెమన్ దాజధానిపై 18 న వైమానికి దాడులు జరిపింది. ఈ దాడులలో 11 మంది మృతిచెందారు.