రాహుల్ జోడో యాత్రకు మద్దతు తెలపిన అఖిలేశ్

ఆగ్రా (CLiC2NEWS): భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఎస్‌పి అధినేత అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చేరకున్న సమయంలో అఖిలేశ్ మద్దతు ప్రకటించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుపిలో కాంగ్రెస్-సమాజ్‌వాది పార్టి మధ్య సీట్ల సర్దుబాటుపై ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు 17 లోక్‌సభ స్థానాల్లో, ఎస్‌పి 63 స్థానాల్లో పోటీచేయనుంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ జోడో యాత్రకు ఆదివారం ఆగ్రలో అఖిలేశ్ మద్దతు తెలిపారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర మొదలైన తర్వాత విపక్ష పార్టీకు చెందిన కీలక నేత పాల్గొనడం ఇదే తొలిసారి.