థియేట‌ర్ వ‌ద్ద రివ్యూ అడుగుతూ బాలీవుడ్ స్టార్ హీరో..

ముంబ‌యి (CLiC2NEWS): ముంబ‌యిలో ఓ థియేట‌ర్ వ‌ద్ద బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్ సంద‌డి చేశారు. తాను న‌టించిన ‘హౌస్‌పుల్ 5’ చిత్రం శుక్ర‌వారం విడుద‌లైంది. త‌న సినిమాపై ప్రేక్ష‌కుల అభిప్రాయం తెలుసుకునేందుకు బాంద్రాలోని థియేట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లారు. కిల్ల‌ర్ మాస్క్ ధ‌రించి నేరుగా సినీ ప్రియుల నుండి రివ్యూ తెలుసుకున్నారు. సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌ను సినిమా ఎలా ఉంది అని ప్ర‌శ్నించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయ‌న ఇన్‌స్టా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు.

అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘హౌస్‌పుల్ 5’. ఈ చిత్రంలో అభిషేక్ బ‌చ్చ‌న్‌, రితేశ్ దేశ్‌ముఖ్‌, ఫెర్నండెజ్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ , సంజ‌య్ ద‌త్‌, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ న‌టించారు.

Leave A Reply

Your email address will not be published.