నక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో ఆలీప్ ఇగ్జిబిషన్‌ను ప్రారంభిచిన గవర్నర్
![](https://clic2news.com/wp-content/uploads/2023/02/ALEAP-EXHIBITION.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని నక్లెస్ రోడ్డులో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అలీప్ ఎగ్జిబిషన్‌ను రాష్ట్ర గవర్నర్ తమిళసై ప్రారంభించారు. దీనిలో ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్ పరిశీలించారు. మేక్ ఇన్ ఇండియా లో భాగంగా.. రాష్ట్ర స్థాయి ప్రదర్శన -2023 ని పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు , అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు రూపొందించిన వివిధ రకాల ఉత్పత్తులతో 100 కు పైగా స్ఠాళ్లు కొలువుదీరినాయి. చేనేత వస్త్రాలు, సేంద్రీయ ఉత్పత్తులు, చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాలు, ఇంటి అలంకరణ సామాగ్రి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
Incredible points. Sound arguments. Keep up the amazing work.