ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుడిగా అలీ..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుడిగా అలీని నియ‌మించింది. దీనిపై తాజాగా అలీ మాట్లాడుతూ.. ఎల‌క్ట్రానిక్ మీడియా ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా నియ‌మించినందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొని, పార్టీ అప్ప‌గించిన ప‌నుల‌ను నిబ‌ద్ధ‌త‌తో త‌ను నిర్వ‌హించాన‌ని.. త‌న సేవ‌ల‌ను సిఎం గుర్తించార‌న్నారు. త‌న‌కు ద‌క్కిన ఈ ప‌ద‌వి.. త‌న కుమార్తె వివాహానికి సిఎం ఇచ్చిన బ‌హుమ‌తిగా భావిస్తున్నాన‌ని అన్నారు. ఈ ప‌ద‌విలో అలీ రెండేళ్లు కొన‌సాగుతారు. ఇత‌ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల మాదిరిగానే జీత‌భ‌త్యాలు అందుతాయి.

Leave A Reply

Your email address will not be published.