వైభవంగా సినీ నటుడు అలీ కుమార్తె నిశ్చితార్థం..
హైదరాబాద్ (CLiC2NEWS): సినీ నటుడు అలీ.. హీరోగా, కమెడియన్గా, బుల్లితెర వ్యాఖ్యాతగా అందరికీ సుపరిచితమే. ఆయన పెద్ద కుమార్తె ఫాతిమా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇటీవల మెడిసన్ పూర్తి చేసుకన్న అలీ కుమార్తె త్వరలో పెళ్లిపీటలెక్కబోతుంది. తమ కుమార్తె నిశ్చితార్థం వీడియోను ఆయన సతీమణి జుబేదా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ నిశ్చితార్థంకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు హాజరయ్యారు.