నేపాల్ విమాన ప్ర‌మాదంలో ప్ర‌యాణికులంతా మృతి!

ఇప్ప‌టి వ‌ర‌కు 14 మృత‌దేహాలు ల‌భ్యం

ఖాఠ్మాండు (CLiC2NEWS): నేపాల్‌లో ఆదివారం జ‌రిగిన విమాన ప్ర‌మాదంలో ప్ర‌యాణికులెవ‌రు ప్రాణాల‌తో ఉండే అవ‌కాశం లేద‌ని అధికారులు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 14 మంది మృత దేహాల‌ను అధికారులు వెలికితీశారు. మిగ‌తావారి కోసం అధికారులు బృందాలుగా గాలింపు చ‌ర్య‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. తారా ఎయిర్‌లైన్స్ కు చెందిన 9ఎఫ్‌-ఎఇటి ట్విన్ విమానం ఆదివారం ఉద‌యం 9.55 గంట‌ల స‌మ‌యంలో గల్లంతైన విష‌యం తెలిసిందే. అయితే విమానం ఆచూకీని సోమ‌వారం ఉద‌యం సైన్యం గుర్తించింది. కొండ భాగాన్ని ఢీకొన‌డంతో విమానం కూలిపోయి ఉంటుంద‌ని అదికారులు అంచ‌నా వేశారు. విమానానికి సంబంధించిన శ‌క‌లాల‌ను ముస్తాంగ్‌లో థ‌సంగ్ ప‌ర్వ‌త ప్రాంతంలో గుర్తించిన‌ట్లు నేపాల్ ఆర్మీ వెల్ల‌డించింది. భారీగా గాలింపు చ‌ర్య‌లను రెస్క్యూ సిబ్బంది చేప‌ట్టింద‌ని ఆర్మీ అధికార ప్ర‌తినిధి బ్రిగేడియ‌ర్ జ‌న‌ర‌ల్ నారాయ‌ణ్ సిల్వాల్ తెలిపారు.
కాగా ఇప్ప‌టి వ‌ర‌కు 14 మృత‌దేహాల‌ను ఘ‌ట‌నాస్థ‌లంలో గుర్తించిన‌ట్లు అధికారులు తెలిపారు. ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతానికి 100 మీ. ప‌రిధిలో మృత‌దేహాలు చెల్లాచెదురుగా ప‌డిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.