విభ‌జ‌న హామీల‌న్నీ నెర‌వేర్చాలి

ఢిల్లీ (CLiC2NEWS): సోమావారం నుండి జ‌ర‌గే పార్ల‌‌మెంట్ శీతాకాల‌ స‌మావేశాల్లో విభ‌జ‌న హామీల‌న్నీ నెర‌వేర్చేలా పోరాడ‌తామ‌ని ఎంపి విజ‌య‌సాయి రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆదివారం జ‌రిగిన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో ఎపి ఎంపీలు పాల్గొన్నారు. ఎంపి మీడియాతో మాట్లాడుతూ.. క‌నీస మ‌ద్దతు ధ‌ర చ‌ట్టం తీసుకురావాల‌ని స‌మావేశంలో కోరామ‌ని తెలిపారు. ఎపిలో 24 పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తున్నామ‌ని , దేశ‌వ్యాప్తంగా అన్ని పంట‌ల‌కూ మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని కోరిన‌ట్లు చెప్పారు. ఆహార భ‌ద్ర‌త చ‌ట్టంలో ఎపికి జ‌రిగిన అన్యాయం స‌రిదిద్దాల‌ని విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లు వెల్ల‌డించారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌, దిశ బిల్లును ఆమోదించాలని కోరామ‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.