భారీ వర్షాల కారణంగా విశాఖ రోడ్లన్నీ జలమయం
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/rain-in-vizag.jpg)
విశాఖ (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. విశాఖ నగరంలో రోడ్లన్నీ జలమయమయి వాహనాలకు అంతరాయం కలుగుతుంది. తాజాగా పూర్ణ మార్కెట్, బావులమదుం, స్టేడియం రోడ్డు, రైల్వే కాలనీ, జ్ఞానాపురం, షీలా నగర్ పలు ప్రాంతాలల్లో వరద నీరు ప్రవహిస్తోంది. చావులమదుం రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో అండర్ డ్రైనేజి పొంగిపొర్లుతుంది.