పంజాగుట్ట పిఎస్ సిబ్బంది మొత్తం బదిలి.. హైదరాబాద్ సిపి

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ హైదరాబాద్ సిపి ఆదేశాలు జారీ చేశారు. ఈ పిసి పిరధిలో కేసులు విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్టేషన్‌లోని పనిచేస్తున్న ఎస్సైల నుండి హోంగార్డుల వరకు మొత్తం 85 మందిని ఒకేసారి బదిలి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిని సిటి ఆర్మ్‌డ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
పంజాగుట్ట పిఎస్‌కు నూతనంగా 82 మంది సిబ్బందిని నియమించారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బందిని ఇక్కడికి బదిలీ చేశారు. బోధన్ మాజి ఎమ్మెల్యే తనయుడి వ్యవహారంతో పాటు వివిధ కేసులకు సంబంధించిన కీలక విషయాలు బయటికి రావడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రజాభవన్‌లోని ప్రభుత్వ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని ఆరోపణలపై బదిలీ వేటు పడినట్లు సమాచారం.