వైఎస్ఆర్‌సిపికి ఆళ్లనాని రాజీనామా..

ఏలూరు (CLiC2NEWS): మాజి డిప్యూటి సిఎం, ఏలూరు జిల్లాకు చెందిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) రాజీనామా చేశారు. గత ప్రభుత్వం ఆయన డిప్యూటి సిఎంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితోపాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను వైఎస్ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టి కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.