ప్రతిపక్షాల కూటమి.. I-N-D-I-Aగా నామకరణం
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/OPPOSITION-PARTIES-MEET-2.jpg)
బెంగళూరు (CLiC2NEWS): బెంగళూరు వేదికగా నిర్వహించిన ప్రతిపక్ష పార్టీల రెండో రోజు సమావేశంలో సోనియా గాంధీ పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశం బెంగళూరులో నిర్వహించారు. మొత్తం 26 పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశంలో భేటీ అయినట్లు సమాచారం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. విపక్షాల కూటమికి INDIA
(ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్) గా నామకరణం చేసినట్లు.. ఈ పేరును అన్ని పార్టీలు అంగీకరించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. 11 సభ్యులతో కూడిన సమన్వయ కమిటి ఏర్పాటు చేశారాని.. తదుపరి సమావేశంలో వారి పేర్లను ప్రకటిస్తామన్నారు. తదుపరి సమావేశం ముంబయిలో జరగనున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాన అభ్యర్థి ఎవరనేది ఆ సమావేశంలో నిర్ణయిస్తామని అన్నారు. పాట్నాలో జరిగిన భేటీలో 16 పార్టీలు హాజరైతే.. నేడు జరిగిన సమావేశానికి 26 పార్టీల నేతలు పాల్గొన్నట్లు తెలిపారు.