Telangana Budget: వ్యవసాయ రంగానికి కేటాయింపులు రూ. 26,831 కోట్లు

హైదరాబాద్ (CLIC2NEWS): 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు బడ్జెట్ను శాసన సభలో ప్రవేశ పెట్టారు. తెలంగాణ మొత్తం బడ్జెట్ 2,90,396 కోట్లతో ప్రతిపాదించారు. ప్రగతీశీల రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, తెలంగాణ ఆచరిస్తుంది. దేశం అనుసరిస్తోంది అంటూ మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు పదేళ్ల వ్యవసాయం, దాని అనుంబంధ రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం రూ. 7,994 కోట్ల నిధులు కేటాయించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 2023 జనవరి వరకు తెలంగాణ సర్కార్ లక్షా 91 వేల 612 కోట్ల రూపాయలు.. అంటే గతంలో కంటే 20 రెట్లు నిధులు అధికంగా ఖర్చు చేసింది.“ అని అర్థిక మంత్రి పేర్కొన్నారు.
- వ్యవసాయానికి కేటాయింపులు రూ. 26,831 కోట్లు
- నీటి పారుదలశాఖకు రూ. 26,855 కోట్లు
- విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు
- ఆసరా పింఛన్ల కోసం రూ. 12 వేల కోట్లు
- దళిత బంధు కోసం రూ. 17,700 కోట్లు
- ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36, 750 కోట్లు
- ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ. 15, 233 కోట్లు
- బిసి సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
- మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు
తప్పకచదవండి:telangana budget: తెలంగాణ మొత్తం బడ్జెట్ 2,90,396 కోట్లు
[…] […]
[…] […]