ఎపి ఎంపి రామ్మోహన్ నాయుడుకి పౌరవిమానయానం..

ఢిల్లీ (CLiC2NEWS): ప్రధాని కేబినేట్‌లో మంత్రులకు శాఖలు కేటాయింపు జరిగింది. మొత్తం 71 మంది మంత్రులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ప్రమాణం స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. వీరందరకు శాఖలు కేటాయింపు ముగిసింది. వారికి కేటాయించిన శాఖల వివరాలతో రాష్ట్రపతి భవన్ సోమవారం రాత్రి జాబితాను విడుదల చేసింది. కేబినేట్ మంత్రులు 30.. 36 మంది సహాయ మంత్రలుగా , ఐదుగురు స్వతంత్ర మంత్రులు ఉన్నారు.
రాజ్‌నాత్ సింగ్ – రక్షణ శాఖ
అమిత్ షా – హోం మంత్రిత్వ , సహకార శాఖ
నితిన్ గడ్కరీ రోడ్లు – జాతీయ రహదారులు
జగత్ ప్రకాశ్ నడ్డా – ఆరోగ్య, సంక్షేమం, రసాయనాలు, ఎరువులు
నిర్మలా సీతారామన్ – ఆర్ధికం, కార్పెరేట్ వ్యవహారాలు
హెచ్‌డి. కుమారస్వామి – భారీ పరిశ్రమలు, ఉక్కు
తెలంగాణలో గంగాపురం కిషన్ రెడ్డికి బొగ్గు గనులు
బండి సంజయ్ కుమార్కు హోం ..
ఎపి నుండి రామ్మోహన్ నాయుడికి పౌరవిమానయానం..
పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి , కమ్యూనికేషన్స్..
భూపతి రాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు.