ఎపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అల్లు అర్జున్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన కోరారు. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారంటూ అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన ఉన్నత న్యాయాస్తానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు విచారణ జరపనున్నట్లు సమాచారం.