అమరావతి కి రూ. 15వేల కోట్ల సాయం: నిర్మలాసీతారామన్
న్యూఢిల్లీ (CLiC2NEWS): లోక్‌సభలో మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పద్దులు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వివిధ ఏజెన్సీల ద్వారా అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్ల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు మంత్రి పార్లమెంటులో వెల్లడించారు. అంతే కాకుండా ఎపి కి అవసరాన్ని భట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని కూడా వెల్లడించారు.
ఆంధ్రుల జీవనాడి పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. భారత్‌లో ఆహార భ్రదతకు పోలవరం ఎంతో కీలకమని పేర్కొన్నారు. వీటితో పాటు ఎపిలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని అందజేయనున్నట్లు తెలిపారు. ప్రకాశం, ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.