పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్ రాజీనామా..

చండీగ‌ఢ్‌ (CLiC2NEWS): పంజాబ్ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. రాజ‌కీయ కుర‌వృద్ధుడు, కెప్టెన్ అమ‌రీంద‌ర్‌సింగ్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న స‌తీమ‌ణితో క‌లిసి రాజ్‌భ‌వ‌న్‌కు చేరుకున్న కెప్టెన్‌.. గ‌వ‌ర్న‌ర్ భ‌న్వ‌రిలాల్ పురోహిత్‌కు రాజీనామా ప‌త్రాన్నిస‌మ‌ర్పించారు.

పీసీసీ అధ్యక్షుడు సిద్ధూతో నెలకొన్న ఆధిపత్య పోరు చివరికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేసే పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ అధినేత్రి ఆదేశాల మేరకు అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. ఈ సాయంత్రం ఐదు గంటలకు పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరుగుతోన్న నేపథ్యంలో అమరీందర్ రాజీనామా చేయడం విశేషం.

కాగా, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌ నవజోత్‌ సింగ్ సిద్ధూతో విభేదాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన సీఎం పదవికి రాజీనామా అనే సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో తాజా రాజ‌కీయ ప‌రిణామాలతో విసిగిపోయాన‌ని, ఇలాగైతే ప‌ద‌విలో కొన‌సాగ‌లేన‌ని పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ ముందు అమ‌రీంద‌ర్ వ్య‌క్తం చేసిన‌ట్లు ఈ ఉద‌యం వార్త‌లొచ్చాయి. అక్క‌డికి కొన్ని గంట‌ల్లోనే ప‌ద‌వి నుంచి వైదొల‌గ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు కొత్త నాయ‌కుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్షం ఈ సాయంత్రం స‌మావేశ‌మ‌వుతోంది.

1 Comment
  1. Facebook Marketing says

    Wow, fantastic weblog layout! How lengthy have you ever been running a blog for? you make running a blog glance easy. The full glance of your website is excellent, as neatly as the content material!!

Leave A Reply

Your email address will not be published.