తెలంగాణలో రూ. 9,500 కోట్ల ‘అమరరాజా’ పెట్టుబడులు..
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/KTR-SPEACH.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన అమరరాజా సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంస్థ 37 సంవత్సరాలుగా సేవలందిస్తుందన్నారు. సుమారు రూ. 9,500కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఈ సంస్థ ముందుకురావడం గొప్ప విషయమని కెటిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంతో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్, అమరరాజా సంస్థ ఛైర్మన్, ఎండి గల్లా జయదేవ్, ఐటి పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి జయేష్ రంజన్, టిఫైబర్ ఎండి, సిఇఒ సుజయ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.