అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఫోన్లపై భారీ డిస్కౌంట్
Great Republic Day Sale : ప్రముఖ ఇ- కామర్స్ సంస్థ అమెజాన్ రేపటి నుండి రిపబ్లిక్ డే ఆఫర్ సేల్ ప్రారంభించనుంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఆఫర్ పేరుమీద మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఇవ్వనుంది. శాంసంగ్, రియల్మి, ఐకూ, వన్ప్లస్, వివోతో పాటు ఇతర కంపెనీల ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లను సైట్లో ప్రదర్శించింది. ఐఫోన్ 13 ఎమ్మార్పి ధర రూ. 59,900 ఉండగా.. సేల్ సమయంలో 48,999కే కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్ గెలాక్సి ఎస్ 23 5జి ప్రస్తుతం రూ. 64,999 ఉండగా.. ఆఫర్ సమయంలో రూ. 54,999కే కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్ గెలాక్సి ఎ 34 5జి ధర రూ. 30,999 ఉండగా.. ఆఫర్లో రూ. 25,999కే లభిస్తుంది. మోటొరొలా రేజర్ 40 అల్ట్రా ధర రూ. 1,19,999 ఉండగా..కేవలం రూ. 69,999 కే కొనుగోలు చేయచ్చు. ఇంకా ఐకూ, నియో 7 5జి ధర రూ. 29,999 ఉంగా.. సేల్ సమయంలో రూ. 23,999 కే లభిస్తుంది. ఇంకా ఎస్బిఐ క్రెడిట్ కార్డు, ఇఎంఐ లావాదేవీలపై 10శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చని ప్రకటించింది.