తెలంగాణ‌లో అమెజాన్ రూ. 60 వేల కోట్ల పెట్టుబ‌డులు

 

రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప‌లు సంస్థ‌లు ముందుకొస్తున్నాయి. దావోస్‌లో సిఎం రేవంత్ రెడ్డి ప‌లు భారీ సంస్థ‌ల‌తో స‌మావేశ‌మ‌వుతున్నారు. తాజాగా దిగ్గ‌జ సంస్థ అమెజాన్ తెలంగాణ‌లో భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దావోస్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ గ్లోబ‌ల్ ప‌బ్లిక్ పాల‌సి వైస్ ప్రెసిడెంట్ మైకేల్‌తో సిఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో రూ.60వేల కోట్ల పెట్టుబ‌డి పెట్టేందుకు అమెజాన్ అంగీకారం తెలిపిన‌ట్లు స‌మాచారం. దీంతో డేటా సెంట‌ర్ల‌ను ఆమెజాన్ విస్తరించ‌నుంది. దీనికి అనువైన భూమిన ప్ర‌భుత్వం కేంటాయించేందుకు ఒప్పందం జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

మ‌రోవైపు రాష్ట్రంలోని పోచారంలో ఐటి క్యాంప‌స్ విస్త‌ర‌ణ‌కు ఇన్ఫోసిస్ సంస్థ అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ఇన్ఫోసిస్ సిఎఫ్ ఒ సంగ్రాజ్‌తో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు స‌మావేశ‌మ‌య్యారు. రూ.750కోట్ల‌తో మొద‌టి ద‌శ విస్త‌ర‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు సంస్థ తెలిపింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా 17 వేల మందికి ఉపాధి దొరుకుతుంద‌ని వెల్ల‌డించారు.

త‌ప్ప‌క చ‌ద‌వండి: రవాణా రంగంలో పెట్టుబ‌డులకు ముందుకు రావాలి: సిఎం రేవంత్ రెడ్డి

                                  స‌న్ పెట్రో కెమిక‌ల్స్‌తో భారీ పెట్టుబ‌డుల‌కు ఒప్పందం

Leave A Reply

Your email address will not be published.