అంబర్‌పేట నాకు జీవం పోసింది:.: కిషన్ రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): అంబర్‌పేటకు వస్తే చాలా రోజుల తరువాత బిడ్డ తల్లి దగ్గరికి వచ్చినట్లు ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తాను ఢిల్లీలో ఉన్నానంటే కారణం అంబర్‌పేట, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలని మంత్రి ప్పారు. జన ఆశీర్వాద యాత్ర శనివారం హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చేరుకుంది. తన సొంత నియోజకవర్గంలోని అంబర్ పేట ప్రజలు తన ప్రాణమని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంబర్‌పేట గురించి ప్రసంగిస్తూ కిషన్ రెడ్డి ఒక సందర్భంలో భావోద్వేగానికి లోనయ్యారు. కేంద్ర మంత్రి అయినందుకు సంతోషం లేదని.. అంబర్‌పేటకు దూరమయ్యానని బాధ ఉందన్నారు. అంబర్‌పేట బిడ్డగా అందరూ గర్వపడేలా పని చేస్తానని చెప్పారు. అంబర్‌పేట నాకు తల్లిలాంటిది. ఈ ప్రాంతమే నాకు జీవంపోసింది.. పార్టీ.. అంబర్‌పేట నాకు రెండు కళ్లతో సమానం అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పలు విషయాలను ప్రస్తావించారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో మీ అంబర్‌పేట బిడ్డ కృషి కూడా ఉందని పేర్కొన్నారు. త్వరలో గోల్కొండ కోటను కూడా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అంబర్‌పేట ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. అంబర్‌పేట తనకు రెండు కళ్లతో సమానమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.