కర్నూలు నుండి బిహార్ వెళుతున్న అంబులెన్స్ బోల్తాపడి నలుగురు మృతి

కర్నూలు (CLiC2NEWS): కర్నూలు నుండి బిహార్‌కు వెళుతున్న అంబులెన్స్ మధ్యప్రదేశ్‌లోని జియోని జిల్లాలో రోడ్డుప్రమాదానికి గురైంది. ఓ రోగిని బిహార్‌కు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బిమార్‌లోని చంపారన్‌కు వెళుతున్న అంబులెన్స్ మార్గ మధ్యలో బజల్‌పుర్-నాగ్‌పుర్ హైవే పై ఓ పాదచారుడిని ఢీకొట్టింది. అనంతరం ఓ స్థంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను జబల్‌పుర్ ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు.