భారత్ వైఖరిని తప్పుపట్టిన అమెరికా

వాషింగ్టన్ (CLiC2NEWS): భారత దేశం వ్యవహిరస్తున్న తీరు తీవ్ర నిరాశాజనకంగా ఉందని అమెరికా విమర్శించింది. రష్యాతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా తప్పుపట్టింది. స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం వైపు మనం నిలబడాలని.. ఉక్రెయిన్‌కు అండగా ఉండాలని, కానీ యుద్ధ కాంక్షతో ఉన్న రష్యా అద్యక్షుడు పుతిన్‌కు ఫండింగ్ చేయడం సరైంది కాదని అమెరికా వాణిజ్య మంత్రి గినా రైబండో ఆరోపించారు. వాషింగ్టన్లో రిపోర్టరుతో మాట్లాడుతూ.. అమెరికా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.