ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటనపై అమెరికా స్పందన..

వాషింగ్టన్ (CLiC2NEWS): భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఉక్రెయిన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆదేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌లో శాంతి పునఃస్థాపన కోసం జరిగే ప్రతి ప్రయత్నంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు మోడీ ఉద్ఘాటించారు. ఈ పర్యటనపై వైట్‌హౌస్ స్పందించింది. ఈ పర్యటనలో శాంతి కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితం రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది. ప్రపంచ దేశాలు సైతం మోడీ పర్యటనపై ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపింది. ఈ పర్యటన ద్వారా రష్యా, ఉక్రెయిన్ సంఘర్షణకు ముగింపు పలికినట్లైతే .. అది ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు అగ్రరాజ్యం సెక్యూరిటి కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్చి వెల్లడించినట్లు సమాచారం.
ఉక్రెయిన్ పర్యటనలో జెలెన్‌స్కీతో మోడీ భేటీ అయ్యారు. ఇరువురి మధ్య జరిగిన చర్చల గురించి విదేవీ వ్యవహారాల మంత్రి జైశంకర్ మీడియాకు వివరించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి ఉక్రెయిన్ మద్దతు తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ .. ఇకనైనా యుద్ధానికి ముగింపు పలకాలని, ఇరు దేశాలు కూర్చొని మాట్లాడుకోవాలని మోడీ పిలుపినిచ్చారన్నారు. కాగా గత నెలలో మాస్కో వెళ్లిన మోడీ రష్యా , ఉక్రెయిన్ యుద్ధం గురించి అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపారు. చర్చలు, దౌత్యం ద్వారానే దేనికైనా పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు భారత్ సిద్ధంగా ఉంది