తెలంగాణలో పలుచోట్ల స్వల్పంగా కంపించిన భూమి

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. 2 నుండి 4 సెకన్ల పాటు భూప్రకంపనలు సంభవించాయి. కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భూమి కంపించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, రామడుగు, కమ్మర్‌పల్లి, మోర్తాడ్ తదితర ప్రాంతాల్లో 2 సెకన్లపాటు భూమి కంపించింది. మరోవైపు నిర్మల్ జిల్లాలోని కడెం, జన్నారం, ఖానాపూర్,లక్ష్మణ్ చాందా మండలాల్లో 2 నుండి 5 సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.