శ్రీశైలం మల్లన్న స్వామి సేవలో అమిత్‌షా

శ్రీశైలం (CLiC2NEWS): కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన అమిత్‌షా అక్క‌డ నుండి హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకున్నారు. శ్రీ‌శైలంలో ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాని మోహన్, బీజేపీ నేతలు ఆదినారాయణ రెడ్డి త‌దిత‌రులు అమిత్‌షాకు ఘ‌న‌స్వాగతం పలికారు. ఆల‌యం వ‌ద్ద పూర్ణ కుంభంతో కేంద్రం మంత్రికి వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం ఆయ‌న కుటుంబ సమేతంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 3.50 గంటలకు అమిత్ షా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు పోలీసులు.

Leave A Reply

Your email address will not be published.