హైదరాబాద్‌లో అమిత్‌షా పర్యటన షెడ్యూల్

హైదరాబాద్ (CLiC2NEWS): కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబరు 17వ తేదీన తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం రాత్రి నగరానికి రానున్నారు. శంషాబాద్ ఎయిర్‌ఫోర్టుకు శుక్రవారం రాత్రి 9.50గంటలకు చేరుకుంటారు. 17న పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే విమోచన వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం బేగంపేట హరితప్లాజాలో బిజెపి రాష్ట్ర కోర్ కమిటీతో అమిత్‌షా భేటీ కానున్నారు.