గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్క‌లు నాటిన అమితాబ్ బ‌చ్చ‌న్

ఎంపి జోగినప‌ల్లి సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ప్ర‌ముఖ‌ బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ , బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని మొక్క‌లు నాటారు. రామోజీఫిలిం సిటీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో బిగ్ బితోపాటు అక్కినేని నాగార్జున‌, నిర్మాత అశ్వినీద‌త్‌, ఫిలిం సిటీ ఎండీ విజ‌యేశ్వ‌రి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా అమితాబ్ మాట్లాడుతూ..భావి త‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డే మంచి కార్య‌క్ర‌మం చేప‌ట్టార‌ని ఎపిని అమితాబ్ బ‌చ్చ‌న్ అన్నారు. బిగ్ బీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న విష‌యాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ట్విట‌ర్ ద్వారా షేర్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.