చిరంజీవికి ఎఎన్నాఆర్ జాతీయ అవార్డును అందజేసిన అమితాబ్
హైదారాబాద్ (CLiC2NEWS): అక్కినేని నాగేశ్వరరావు శతజయంతిని పురస్కరించుని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎఎన్నార్ జాతీయ అవార్డు (2024)ను అమితాబచ్చన్ అందజేశారు. ఈ అవార్డు ప్రదానోత్సవ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈకార్యక్రమానికి బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎఎన్నార్ జాతీయ అవార్డును అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందుకున్న తర్వాత మెగస్టార్ చిరంజీవి మాట్లాడారు.
“నా గురువు అమితాబ్ బచ్చన్‌కు ముందుగా ధన్యవాదాలు. ఎప్పడు నాకు ఏ మంచి జరిగినా, నాకు ఎప్పుడైనా అవార్డు వచ్చినా ఆయన నుంచి తొలుత నాకు శుభాకాంక్షలు వస్తాయి. కొన్ని సార్టు ఆయన వచ్చి ఇలా వచ్చి ఆశీర్వదిస్తుంటారు. ఆయన లాంటి బిగ్ స్టార్ నాకు ఈ అవార్డు అందజేయడం ఆనందదాయకం“ అని చిరంజీవి అన్నారు.
అతిథులను అక్కినేని నాగార్జున, నాగచైతన్య ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో విక్టరీ వెంకటేశ్, రామ్‌చరణ్ , నాని , శ్రీలీల, రమ్యకృష్ణ, రాజేంద్రప్రసాద్, దర్శకుడు కే. రాఘవేంద్రరావు, బోయపాటి, నాగ్ అశ్విన్, మురళీ మోహన్, బ్రహ్మానందం, నందమూరి రామకృష్ణ, ప్రకాశ్ రాజ్, అక్కినేని కుటుంబ సభ్యులు సహా పలువురు టాలీవుడ్ అతిరథ మహారథులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కీరవాణి సారథ్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చివరగా అక్కినేని మాట్లాడిన మాటలను ప్లే చేయడం అతిథులను ఆకట్టుకొంది.