ఎట్టకేలకు పంజాబ్‌లోనే అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/AMRITHPAL-SING.jpg)
చంఢీగఢ్ (CLiC2NEWS): దాదాపు నెల రోజులకుపైగా వెతుకుతున్న ఖలిస్థానీ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్‌ను పంజాబ్‌లో పోలీసులు పట్టుకున్నారు. మోగా జిల్లాలో ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతనిని ఆస్సాంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించనున్నట్లు సమాచారం. అమృత్‌పాల్ అరెస్టు నేపథ్యంలో ప్రజలందరు శాంతి భద్రతలు పాటించాలని సూచించింది. ఎటెవంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని పోలీసు కమిషనర్లు, ఎస్ ఎస్పిలు జాగ్రత్తగా పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.
అమృత్‌పాల్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్ సింగ్‌ను పోలసులు అరెస్టు చేశౄరు. అమృత్‌పాల్ పిలుపు మేరకు ఫిబ్రవరి 24వ తేదీన అమృత్సర్ జిల్లాలోని అజ్నాలా పోలీస్‌స్టేషన్‌పై పెద్ద సంఖ్యలో దాడి చేశారు. అల్లర్లు జరిగే విధంగా యువతను రెచ్చగొట్టారనే ఆరోపణల కారణంగా అతనిపై కేసు నమోదైంది. అప్పటి నుండి పరారీ ఉన్న అమృత్‌పాల్ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు.