అమూల్ పాల ధరలు తగ్గింపు..
గుడ్‌న్యూస్
Amul: ప్రముఖ డెయిరీ అమూల్ పాల ధరల్ని తగ్గించినట్లు ఆ సంస్థ ప్రకటన చేసింది. మూడు రకాల పాలపై లీటరుకు రూపాయి చొప్పున తగ్గించింది. ఆ సంస్థ అందిస్తున్న ప్రధాన పాల ఉత్పత్తులు అన్నింటిపై తగ్గింపు వర్తించనుంది. అయితే గతేడాది జూన్‌లో అమూల్, మదర్ డెయిరీ లీటరు పాలపై రూ.2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది.
అమూల్ ప్రధాన పాల ఉత్పత్తులైన అమూల్ గోల్డ్, అమూల్ టి స్పెషల్ పై ఈ తగ్గింపు ఉంటుంది. ధరల తగ్గింపు తర్వాత అమూల్ గోల్డ్ ధర రూ. 65 (లీటరు), అమూల్ టి స్పెషల్ ధర రూ.61(లీటరు ), అమూల్ తాజా ధర రూ.53గా ఉంది. ఈ విషయాన్ని అమూల్ పేరిట పాలను విక్రయించే గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండి వెల్లడించారు.