బస్సుపై కరెంటు తీగ పడి ప్రయాణికులు సజీవదహనం..

గాజీపుర్ (CLiC2NEWS): బస్సుపై హైటెన్షన్ కరెంట్ తీగ తెగిపడి ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సుపై కరెంటు తీగ పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటి వరకు ఆరుగురు మృత దేహాలను గుర్తించారు. తీవ్రంగా గాయాలైన 10 మందిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున ఆర్ధిక సాయం అందిస్తామని ప్రకటించారు.