నేపాలోని ఓ నదిలోకి దూసుకెళ్లిన భారత పర్యటకుల బస్సు

కాఠ్మండూ (CLiC2NEWS): కాఠ్మండూ భారత పర్యాటకులతో ఉన్న బస్సు నేపాల్లోని ఓ నదిలోకి దూసుకెళ్లింది. 43 మంది ప్రయాణికులు ఉన్న బస్సు శుక్రవారం నేపాల్లోని పొఖారా నుండి కాఠ్మండూ వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. కొండల ప్రాంతంలో అదుపు తప్పి 150 మీటర్ల లోతులో ఉన్న మర్స్యాంగ్డి నదలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కో్ల్పోయినట్లు సమాచారం. ఇప్పటి వరకు 16 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ నుండి ఓ ట్రావెల్స్ బస్సు బయల్దేరినట్లు సమాచారం. దీనిలో ఉన్న ప్రయాణికులంతా భారతీయులే. నేపాల్లో ఇటీవల జూన్ నెలలలో కురిసిన వర్షాలు కారణంగా కొండచరియలు విరిగిపడి రెండు బస్సులు నదిలో కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో కూడా ఏడుగురు భారతీయులు సహా 60 మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారు.