అగ్ని వీరులకు ఆనంద్ మహీంద్ర ఆఫర్!
కార్పొరేట్ రంగంలో వారికి విస్తృత అవకాశాలు: ఆనంద్ మహీంద్రా
న్యూఢిల్లీ (CLiC2NFEWS): త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన `అగ్నిపథ్` పథకంపై దేశవ్యాప్తంగా జరుగుతోన్న ఆందోళనపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. ఇవాళ (సోమవారం) ఉదయం `అగ్నిపథ్` నిరసనలపై ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఈ సందర్భంగా అగ్నివీరులకు మహీంద్ర ఓ ఆఫర్ ప్రకటించారు. ఈ పథకం కింద సైన్యంలోపని చేసి రిటైర్ అయిన వారికి తమ సంస్థలో పనిచేసే అవకాశం కల్పిస్తామని మహీంద్రా తెలిపారు.
“అగ్నిపథ్` పథకంపై జరుగుతోన్న హింసాత్మక ఆందోళనలు విచారకరం.. గత సంవత్సరం ఈ పథకం గురించి తెలిసినప్పుడు నేను ఒక్కటే తెలిపాను. ఇప్పడు కూడా అదే తెలియజేస్తున్నా.. ఈ పథకంతో అగ్నివీరులు పొందే క్రమశిక్షణ, నైపుణ్యాలు వారికి మంచి ఉపాధి అభించేలా చేస్తాయి. శిక్షణ పొంది. సమర్థులైన యువకులకు రిక్రూట్ చేసుకొనే అవకాశాన్ని మహీంద్రా గ్రూప్ స్వాగతిస్తోంది“ అని ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌లో వెల్లడించారు.
Saddened by the violence around the #Agneepath program. When the scheme was mooted last year I stated-& I repeat-the discipline & skills Agniveers gain will make them eminently employable. The Mahindra Group welcomes the opportunity to recruit such trained, capable young people
— anand mahindra (@anandmahindra) June 20, 2022