సన్‌రైజర్స్ జట్టుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆఫర్

విశాఖ (CLiC2NEWS): సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆఫర్ ఇచ్చింది. హెచ్‌సిఎతో సన్‌రైజర్స్ వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎసిఎ సన్‌రైజర్స్‌కు ఆఫర్ ప్రకటించింది. పన్న మినహాయింపులు, ఇతర సహకారం అందిస్తామని తెలిపింది. ఈ ఐపిఎల్ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను విశాఖలో నిర్వహించాలని ఎసిఎ ప్రతిపాదించింది. సన్‌రైజర్స్ జట్టు నుండి సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.