నిమ్స్‌లో అనస్తీషియా అడిషనల్ ప్రోఫెసర్ ఆత్మహత్య!

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించే అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం బేగంపేటలోని తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ద్రువీకరించారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.