బాగ్ లింగంపల్లి సాయిబాబా ఆలయంలో అన్నదానం

బాగ్‌లింగంప‌ల్లి (హైద‌రాబాద్,CLiC2NEWS ): హైద‌రాబాద్‌లోని బాగ్ లింగంప‌ల్లి సాయిబాబా ఆల‌యంలో బుధ‌వారం గురుపౌర్ణ‌మి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. తెల్ల‌వారు జామునుంచే సాయిబాబా ఆల‌యానికి భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. హార‌తి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. స్వామి వారికి ప్ర‌త్యేక దీపాలు వెలిగించారు. ప‌ల్ల‌కీ సేవ నిర్వ‌హించారు.

బుధ‌వారం గురు పూర్ణిమ సంద‌ర్భంగా బాగ్ లింగంపల్లి సాయిబాబాఆల‌యంలో అన్న‌దాన కార్య‌క్ర‌మ దృశ్యం

గురుపూర్ణిమను పుర‌స్క‌రించుకుని ఆల‌యంలో తంజూవూరి సుమ‌న్ కుమార్ భారీ ఎత్తున అన్న‌దాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దాదాపు ఐదు వేల మందికి పైగా భ‌క్తులు ఈ అన్న‌దాన కార్యక్ర‌మంలో పాల్గొన్నారు. ఈ అన్న‌దాన కార్య‌క్ర‌మాన్ని మాజీ ఎంపి సముద్రాల వేణుగోపాల చారి ప్రారంభించారు. ఈ అన్న‌దాన కార్యక్ర‌మంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, అంబ‌ర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేశ్‌, అన్న‌దాన నిర్వ‌హ‌కులు తంజావూరి సుమ‌న్‌కుమార్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

బుధ‌వారం గురు పూర్ణిమ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, తంజూవూరి సుమ‌న్ కుమార్ త‌దిత‌రులు
బుధ‌వారం గురు పూర్ణిమ సంద‌ర్భంగా బాగ్ లింగంపల్లి సాయిబాబా ఆల‌యంలో అన్న‌దాన కార్య‌క్ర‌మ దృశ్యం

Leave A Reply

Your email address will not be published.