బాగ్ లింగంపల్లి సాయిబాబా ఆలయంలో అన్నదానం

బాగ్‌లింగంపల్లి (హైదరాబాద్, CLiC2NEWS ): హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి సాయిబాబా ఆలయంలో ఆదివారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామునుంచే సాయిబాబా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతి కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక దీపాలు వెలిగించారు. పల్లకీ సేవ నిర్వహించారు.

గురుపూర్ణిమను పురస్కరించుకుని ఆలయంలో తంజావూరి సుమన్ కుమార్ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు ఐదు వేల మందికి పైగా భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్ ఎస్ నాయకులు ముఠా జయసింహా, అన్నదాన నిర్వహకులు తంజావూరి సుమన్‌కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

