మీనా అవయవదానం చేస్తున్నట్లు ప్రకటన
ఈ మధ్య కాలంలో భర్తను కోల్పోయిన ప్రముఖ సీనియర్ నటి మీనా కీలక ప్రకటన చేశారు. తన అవయావాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అవయవ దానం అనేది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. అవయవదానం ప్రాముఖ్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు.
తన ఆరేళ్ల వయస్సులో సినీరంగ ప్రవేశం చేశానని.. ఇప్పటి వరకు దాదాపు 90 చిత్రాల్లో ప్రముఖులతో కలిసి నటించినట్లు గుర్తుచేశారు. భర్తమృతి తనకు తీరనిలోటని తెలిపారు. అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.