ఇకపై ఏటా ఉద్యోగ నియామకాలకు జాబ్‌ క్యాలెండర్

హైదరాబాద్‌ (CLiC2NEWS): ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలల‌కు ఇక‌పై ఏటా జాబ్ క్యాలండ‌ర్‌ను విడుద‌ల చేయాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు ఆదేశించారు. మంగ‌ళ‌వారం ప్రగ‌తిభ‌వ‌న్‌లో స‌మావేశ‌మైన తెలంగాణ మంత్రి వ‌ర్గం రాష్ట్రంలో ఉద్యోగ నియామ‌కాల‌పై వ‌స్తృతంగా చ‌ర్చించింది. ఈ మేరకు అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్‌మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్’ను తయారు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ఇదే అంశంపై మ‌ళ్లీ చర్చించేందుకు రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు మ‌రోసారి స‌మావేశం కావాల‌ని మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింది.

ఇక కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల జిల్లాల వారీగా కేటాయింపులు, నూతన జిల్లాల వారీగా పోస్టులు కేటాయింపులు చేప‌ట్టాల‌ని కేబినెట్ ఆదేశించింది. టీఎన్జీవో, టీజీవో ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు చేసిన విజ్ఞప్తి మేరకు కేబినెట్‌ చర్చించింది.

Leave A Reply

Your email address will not be published.