టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు .. టైటాన్ తరహాలో మరో యాత్ర..!

Triton : అట్లాంటిక్ మహాసముద్రంలో సుమారు 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శకలాలను చేసేందుకు గత ఏడాది జూన్‌లో టైటాన్ బయలుదేరింది. ఐదుగురు పర్యాటకులతో బయలుదేరిన ఈ జలాంతర్గామి టైటానిక్‌కు సమారు 480 మీటర్ల దూరంలో పేలిపోయింది. ఆ విషాద ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇపుడు అదే తరహాలో ఇద్దరు వ్యక్తులతో మరో జలాంతర్గామి యాత్రకు సిద్దమవులున్నట్లు సమాచారం.
అమెరికాలోని ఒహాయోకు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ లారీ కానర్, ట్రిటాన్ సబ్ మెరైన్స్ సహ వ్యవస్థాపకుడు పాట్రిక్ లాహేతో కలిసి సముద్రంలో 12,400 అడుగుల లోతు వరకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ (Triton 4000/2 Abyssal Explorer) మిని జలాంతర్గామి రూపకల్పనకు పాట్రిక్ కు పదేళ్లకుపైగా కష్టపడినట్లు సమాచారం.